ERRABELLI: ఖైరతాబాద్ జిల్లా పరిషత్‌లో దేవాదుల కాలువ నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కాలువ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ పాల్గొన్నారు. కాలువ ద్వారా నిర్మితమయ్యే 3 రిజర్వాయర్ల ద్వారా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు సాగునీరు అందుతుందని మంత్రి అన్నారు.
నష్కల్ – ఉప్పుగల్ రిజర్వాయర్ కింద బమ్మెర, కొండాపురం, వావిలాల, మల్లంపల్లి, దర్దేపల్లి ముత్తారం, తిరుమలాయపల్లి, కొండూరు, కేశవాపురం, గన్నారం, కొలను పల్లి, కాట్రపల్లి, పోతిరెడ్డిపల్లి, బురహాన్‌పల్లి, అవుతాపురం, గంట్లకుంట, పోచంపల్లి, చిన్న వంగర, ఏడునూతుల, రేగుల గ్రామాలను సాగునీరు లభిస్తుందన్నారు. పాలకుర్తి రిజర్వాయర్ కింద దర్దేపల్లి, లక్ష్మీనారాయణపురం, ముత్తారం, విస్నూరు, పాలకుర్తి, వల్మీడి, చెన్నూరు, మంచుప్పుల, తీగారం, ఏడునూతుల గ్రామాలు, చెన్నూరు రిజర్వాయర్ కింద చెన్నూరు, మంచుప్పు ల, లక్ష్మక్కపల్లి, రామవరం, పాఖాల, మోండ్రాయి, కొడకండ్ల, మన్‌పహాడ్, దేవరుప్పుల, ధర్మపురం గ్రామాలకు సాగునీరు అందుతుందని అన్నారు.
ప్రతి గ్రామానికి సాగు నీరు అందిచేలా కృషి జరగాలని, ఇందులో భాగంగా దేవాదుల ఎస్సారెస్పీ కాలువ నీటిని అందించడంలో సమస్యలను పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకు ఉప్పుగల్లు, పాలకుర్తి, చెన్నూరు, రిజర్వాయర్లను పూర్తి చేయాలని అదేశించారు. జాఫర్‌గఢ్, పాలకుర్తి చెరువులను రిజర్వాయర్లు గా చేస్తున్నామని మంత్రి అన్నారు. పాలకుర్తి నియోజవర్గంలోని తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, మండలాల్లో కొన్ని గ్రామాలకు నీరు అందించాల్సి ఉందని మంత్రి స్పష్టం చేశారు. వేసవిలో నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.