CM JGAN: గవర్నర్ వ్యవస్థకు ఒక నిండుతనం తీసుకొచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. గవర్నర్ గా ఉన్న ఈ మూడేళ్లలో….రాజ్యాంగ వ్యవస్థలో సమన్వయం ఎలా ఉండాలో చేసి చూపించారని అన్నారు.
విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు మంగళవారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. చత్తీస్ గఢ్ గవర్నర్ గా వెళ్తున్న బిశ్వభూషణ్ కు ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. తండ్రిలా, పెద్దలా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరించారని ముఖ్యమంత్రి అన్నారు. మాపై , ప్రజలపై ఎంతో వ్యాత్సల్యం చూపించారని తెలిపారు. గవర్నర్లకు, ప్రభుత్వాలకు మధ్య జరిగిన సంఘర్షణలను ఈ మధ్య వార్తలు చూశామని…..కానీ అందుకు భిన్నంగా మన రాష్ట్రంలో పరిస్థితి ఉందని అన్నారు.
ఒడిశా ప్రభుత్వంలో 4 సార్లు మంత్రిగా పనిచేసిన బిశ్వభూషణ్ గారు….ప్రతిశాఖలోనూ తనదైన ముద్ర వేశారని గుర్తుచేశారు. 2000 ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థిపై 95 వేల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారని తెలిపారు. ఎమ్మెల్యేగా 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు.
న్యాయవాదిగా సేవలందించిన సమయంలో హైకోర్టులో బార్ అసోసియేషన్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ గా న్యాయవాదుల సంక్షేమం, హక్కుల కోసం ఎంతో పాటుపడ్డారని తెలిపారు. ఇన్నేళ్ల బిశ్వభూషణ్ రాజకీయ ప్రస్థానంలో…..ఆయన సతీమణి వెన్నుదన్నుగా నిలిచారని ముఖ్యమంత్రి అన్నారు. దేవుడి దయతో ఆయన నిండు నూరేళ్లు బతకాలని, దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని….ఆయన కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. సభను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం….గవర్నర్ నుం ఘనంగా సత్యరించారు.