నందమూరి బాలకృష్ణ, తారకరత్న మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారకరత్న ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అనుక్షణం వెన్నంటే ఉండి పర్య వేక్షించిన బాలకృష్ణ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
తారకరత్న ముగ్గురు పిల్లల బాగోగులు తానే చూసుకుంటానని, తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి కూడా కుటుంబ పరంగా అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.