టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షాకిచ్చింది.ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్ ను వన్డేలకు ఆ బాధ్యతల నుంచి తప్పించింది.
వన్డే సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ప్రకటించింది. ఈ నిర్ణయంతో కేఎల్ రాహుల్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా రాహుల్ పేలవమైన ఫామ్ తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.