తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట, కొండాపూర్ గ్రామాల రైతులు యాసంగి పంటకు నీటిని అందక పొలాలు ఎండి పోతున్నాయి అని సోమవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి కలిసి వినతి పత్రం అందజేశారు..
మంత్రి గారు ENC అధికారి వెంకటేశ్వరరావు తో ఫోన్ లో మాట్లాడి FFC కెనాల్ నుండి కాకతీయ కెనాల్ ద్వారా చెరువులు నింపుతూ, నీరు అందించాలని ఆదేశించారు, వెంటనే అందిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ కి అధికారులు తెలిపారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నీటి విడుదల వలన వెల్గటూర్ మండలం జగదేవ్ పేట, కొండాపూర్ గ్రామాల కే కాకుండా శాఖపూర్, రాజక్కపల్లి, వెల్గటూర్, వెంకటాపూర్, లొత్తునూర్ గ్రామాలకు కింద ఉన్న పంటలకు నీరు అందుతుందని, రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సాగునీరు సరఫరా చేస్తామని, దీనిపై రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన తెలిపారు.ఆయకట్టు గ్రామాల రైతుల చివరి పొలాలకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు