KTR: కేంద్ర భాజపాపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్తిస్తూ ట్వీట్ చేశారు. బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఉలిక్కి పడుతున్నారంటూ కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు.
అదానీ కుంభకోణం, హిండెన్‌బర్గ్ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము కూడా కేంద్ర భాజపాకు లేదని మండిపడ్డారు.
కానీ అదానీ మోసాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు బెదురుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ పరోక్షంగా పెట్టిన ట్వీట్….అదానీ కుంభకోణం, హిండెన్ బర్గ్ నివేదికపై ప్రస్తావన చేసే దమ్ము లేదు కానీ……బిలియనీర్ జార్జ్ సోరోస్ వ్యాఖ్యలు చేయగానే.. వారి మాస్టర్ ను రక్షించడానికి ఆసక్తిగా ఉన్నారు. వారిది ఎంత దయనీయమైన దుస్థితో. ఎంత బుద్ధి లేనివాళ్లో.
అయితే ఈ ట్వీట్ చేస్తూనే…..ఈ ట్వీట్ ఎవరి గురించో , ఎవరి కోసం చేశానో చెప్పడంటూ మంత్రి ప్రశ్నించారు. అంతేకాదండోయ్…. దానికి ద్రోహులకు దేశభక్తే ఆఖరి రక్ష అనే సామ్యేల్ జాన్సన్ సూక్తిని జతచేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ మధ్య భారాస నేతలు కేంద్ర భాజపా ఎడపెడా వాయించేస్తున్నారు. ప్రధానిని సైతం వదలకుండా దంచేస్తున్నారు. నిర్మలా సీతారామన్ ను మాత్రం అబద్ధాల కోరని ముద్రించేశారు కూడా.