minister satyavathi: మహబూబాబాద్ లో పోలీస్ స్టేషన్ లో మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ను మంత్రి సత్యవతి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
శాంతిభద్రతల పర్యవేక్షణలో సీఎం పూర్తి దృష్టి సారించారని మంత్రి అన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా పోలీసులు పనిచేస్తున్నారని మంత్రి కొనియాడారు. సీఎం కేసీఆర్ అభివృద్ధితో పాటు పోలీసు వ్యవస్థ ఆధునీకరణపై దృష్టి సారించారని తెలిపారు. మహిళల భద్రతకు షీ టీమ్స్, సఖి సెంటర్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి మెరుగైన సేవలను అందిస్తుందన్నారు.
పోలీసులకు అత్యుత్తమ ప్యాకేజీలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. పీఎస్ లలో ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఫ్రెండ్లీ రూమ్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. చిన్నారులకు కూడా ఈ ఫ్రెండ్లీ రూం ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు, చిన్నారులు ఇబ్బంది పడకూడదనే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ శ్రీకారం చుట్టడం అభినందనీయమని మంత్రి కొనియాడారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమం మంచి ఫలితాలనే ఇస్తోందని మంత్రి సత్యవతి తెలిపారు. ఫిర్యాదులు చేసేందుకు ప్రజలు కూడా హాయిగా పోలీసుల దగ్గరకు వస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు అదుపు చేయడంపైనా మంత్రి అభినందించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని వెల్లడించారు.