MINISTER JAGADEESH: సంస్కరణలపేరుతో కార్పోరేట్ కే దేశ సంపద అంతా ప్రధాని మోదీ దోచిపెడుతున్నారని మంత్రి జగదీశ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, అదానీల స్నేహం…..ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు. దేశ ప్రజలకు విద్యుత్ ను దూరం చేసేందుకే కేంద్రం పన్నాగం పన్నుతోందని మండిపడ్డారు. అందుకే వీదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్ ను 50 రూపాయలకే అమ్ముకోవచ్చని కేంద్ర ఈఆర్సీ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.
ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తుందని మంత్రి ఆరోపించారు. కేంద్రం తెచ్చినవి సంస్కరణలు కావని…..అవి ప్రజల కడుపు కొట్టే నల్ల విద్యుత్ చట్టాలని విమర్శించారు. కేంద్రం పరిమితికి మించి అప్పులు చేస్తోందని మంత్రి అన్నారు. అనేక తప్పులు చేస్తున్న బీజేపీ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిందేనని వ్యాఖ్యనించారు.
కేంద్ర నిర్ణయం సాధారణ ప్రజల పై తీవ్ర ప్రభావం పడుతుందని వెల్లడించారు. దేశంలో సొంత బొగ్గువనరులు ఉంటే…. విదేశీ బొగ్గు ఎందుకు తెస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. ఆదాని విదేశీ బొగ్గుని బలవంతంగా రాష్ట్రాలకు అమ్మిస్తున్నారని మంత్రి అన్నారు. ఆ విదేశీ బొగ్గు వల్లే విద్యుత్ సమస్య నుంని వస్తుందని మంత్రి ఆరోపించారు. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయం…..కార్పోరేట్ సంస్థలకు, ఆదానికే లాభం, ప్రయోజనమని అన్నారు.
కేంద్ర భాజపా పన్నాగాలను దేశప్రజలు తిప్పికొట్టాలని మంత్రి జగదీశ్ సూచించారు. చివరకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక…… ఇష్టానుసారం అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను నిర్మల్ సీతారామన్ చదువుతున్నారని ఆరోపించారు.
విద్యుత్ విషయంలో కేంద్రం తప్పుడు విధానాలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. కృత్రిమ విద్యుత్ సంక్షోభం సృష్టించడమే ప్రధాని లక్ష్యమని మంత్రి ఆరోపించారు.