MINISTER CHELLUBOYINA: చంద్రబాబు….. సభల వల్ల 11 మందిని పొట్టనపెట్టుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ స్పష్టత లేదని మండిపడ్డారు.
చంద్రబాబు అసలు విజన్ లేని వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబుకు అసలు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని వ్యాఖ్యానించారు. ఆయన చేపట్టిన ప్రతి పనిలోనూ కమిషన్ తప్ప మరొకటి లేదని మండిపడ్డారు.
ఇన్నేళ్లు ప్రజలను నాశనం చేసిన చంద్రబాబు…..ఇప్పుడు కార్యకర్తలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఒక గౌరవ ప్రదమైన ప్రతిపక్షనాయుడిగా ఉంటూ సైకోలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాలకు ఎవరైనా తలొగ్గాల్సిందే….కానీ చంద్రబాబు మాత్రం చట్టాలకు వ్యతిరేకంగా నడుస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే….రాష్ట్రంలో అల్లర్లు రేపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. నిన్న పోలీసుల పట్ల తెదేపా నేతలు, చంద్రబాబు దౌర్జన్యంగా వ్యవహరించారని తెలిపారు.
ఎందులోనూ చంద్రబాబు సఫలీకృతుడు కాలేకపోయాడు….రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటివరకూ అన్నీ ఫెయిల్యూర్ నిర్ణయాలే. ఏ నిర్ణయంలోనూ స్పష్టత లేదని మండిపడ్డారు. అప్పర్ అండ్ లోయర్ కాపర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టకూడదని చిన్నపిల్లవాడికి కూడా తెలుసని అన్నారు. విజన్ అంటే రాజశేఖర్ రెడ్డికి మాత్రమే ఉందని తెలుసన్నారు. చంద్రబాబుకు ఓకే ఒక్క భయం జగన్. తెదేపా శ్రేణులను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తలు…గుండాల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల పట్ల చంద్రబాబు వైఖరెంటో అందరికీ తెలుసని అన్నారు. కార్యకర్తలను సంఘవిద్రోహులుగా తయారుచేస్తున్నారని విమర్శించారు.