షర్మిలమ్మా! మీరు ఘనంగా చెప్తున్న రాజన్న రాజ్యం చూసినం మేము గతంలో. ఆయన పుత్రికగా మీకేమన్నా తెలియకపోతే తెలియజెపుదామని నా ప్రయత్నం. తెలంగాణ బిడ్డ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను దించడానికి హైదరాబాద్ పాతబస్తీలో మత కల్లోలాలు సృష్టించి అమాయకులైన ఇరు మతాల వారిని పొట్టన పెట్టుకున్నరు మీ రాజన్న!
అన్న చేత వెలివేయబడి;
ఆస్తులకు దూరమై;
ఇల్లూ వాకిలీ వదిలి;
ఈసురోమంటూ..!
ఇది అ-ఆ-ఇ-ఈల కవిత కాదు, షర్మిల ప్రహసనం!
ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న అసెంబ్లీలో తెలంగాణ వంచకుల గురించి చెప్తూ ‘బొంకుడు గుంతల రాజశేఖర్‌రెడ్డి’ అన్నరని ఆక్రోశం వచ్చింది షర్మిలకు. ‘నక్క నాక లోకం’ అంటూ సొల్లు వాగిన్రు నిన్న జనగాంలో. కేసీఆర్ మాటలు నిజానికి understatement! ఇంకా ఎక్కువ అనాల్సింది!
షర్మిలమ్మా! మీరు ఘనంగా చెప్తున్న రాజన్న రాజ్యం చూసినం మేము గతంలో. ఆయన పుత్రికగా మీకేమన్నా తెలియకపోతే తెలియజెపుదామని నా ప్రయత్నం. తెలంగాణ బిడ్డ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను దించడానికి హైదరాబాద్ పాతబస్తీలో మత కల్లోలాలు సృష్టించి అమాయకులైన ఇరు మతాల వారిని పొట్టన పెట్టుకున్నరు మీ రాజన్న!
లండన్ బ్యాంకుల్లో బంగారం కుదువబెట్టుకొని బతికే స్థితి నుంచి భరతమాతను ఒడ్డుకు చేర్చిన తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు, ఈ గడ్డ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావుకు మీ నాయన చేసిన అవమానం మరవగలమా? ఢిల్లీలో నంద్యాల గల్లీలో మీరంతా తెలంగాణపై విషం చిమ్మిన విషయం చరిత్రలో లిఖించబడింది కదా? యెట్లా చెరిపేయగలరు? నాటి మీ రాజన్న రాజ్యంలో తెలంగాణలో 161 సెజ్‌లు పెట్టి, రైతుల ఉసురు తీసి, ఒక్క పరిశ్రమా తేక, ఒక్క ఉద్యోగమూ ఇవ్వని మీ భూ దందా మాకు ఎరుకే. జలం పేరుతో చేసిన ధనయజ్ఞమూ విదితమే. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు- పంచభూతాలను కూడా కబళించిన నేతకు ఓ వారసురాలా.. ఇప్పుడొచ్చి ‘వైఎస్’ కన్నీరు కారుస్తవా? కార్వనిర్వాహక వ్యవస్థను సైతం రాజన్న రాజ్యం ఎంత భ్రష్టు పట్టించిందో మాజీ ఐఏఎస్ కుటుంబాలను అడిగితే తెలుస్తది!
అమ్మా.. స్వయంగా మీరే మహబూబ్‌నగర్‌లో తలవంచుకున్నారే… కర్నూలు కూలీలు రాజన్న రాజ్యం వదిలేసి తెలంగాణకు ఉపాధి కోసం వస్తున్నామని చెపితే! మనిషికో మాట…(గొడ్డును ఎందుకు అనడం అని సామెతను సగంలో ఆపేస్తున్న నాకే సిగ్గేసి!) ‘వృథాన్యార్థ భంగము గావించెడివారలెవ్వరో యెఱుంగన్ శక్యమే యేరికిన్?’ అని భర్తృహరి మీ గురించే రాసిన్రనిపిస్తున్నది! మొన్నటికి మొన్న అమర రాజా బ్యాటరీస్ మీ రాజన్న రాజ్యంతో వేగలేమని వచ్చి మా దగ్గర రూ.9,500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం చేసుకున్నది కదా!ఇక్కడికొచ్చి ‘ఆడపిల్ల’ కార్డు వాడజూస్తున్నరు గానీ… సొంత బాబాయి హత్య జరిగితే, ఆయన కూతురు నిస్సహాయురాలైన ఆడపిల్ల సునీతారెడ్డి ఆక్రందన మీకైనా, మీ అన్నకైనా పట్టిందా? పట్టకపోగా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ కేసును నీరుగారుస్తున్నరని కదా కేసును తెలంగాణకు మార్చింది గౌరవ కోర్టు. కుటుంబానికే న్యాయం చేయలేరు, జనాలకు.. అందునా మీకు పరాయి అయిన తెలంగాణ జనాలకు ఏమి చేయగలరు? మీ నాయన చెప్పే డైలాగ్ మీకే చెపుతున్నా: ‘అమ్మకు తిండి పెట్టనోడు చిన్నమ్మకు గాజులు కొనిస్తా అన్నాడంట’. మీ యవ్వారం చూసి తన సామెత తనకే గుర్తుకొచ్చి నవ్విపోడా ఆ ‘మహా’ ఆత్మ!! ఆస్తులు ఇవ్వనందుకే అన్న మీద అలిగి ఇక్కడికొచ్చి పార్టీ పెట్టిన మిమ్మల్ని.. ప్రాణం కంటే అస్తిత్వమే మిన్న అని భావించే తెలంగాణ యెట్లా క్షమించగలదు?
కాన్ ఖోల్ కర్ సున్‌లో షర్మిలా.. ఏ అభివృద్ధి ఇండెక్స్‌లో చూసినా దేశంలోనే ఒకటి రెండు స్థానాల్లో ఉన్న తెలంగాణకు కేసీఆర్ తప్ప మరొకరు అవసరం లేదు. దేశం మొత్తానికి దివిటీ అయిన పాలనను పరీక్ష చేస్తా అంటే శలభంలా మాడిపోతరు మా వెలుగుల వేడికి! కేసీఆర్ రూట్ అంటే తెలంగాణ రూట్ మ్యాప్. ఆయన సైన్యం అయిన మాకు కూడా రాజకీయాలు మీలాగా వ్యాపారం కాదు. అదొక టాస్క్. మేం ఆయన టాస్క్‌ఫోర్స్. జాగ్రత్తగా ఉండాలె మాతో! ప్రజల శ్రమ ద్వారా పెరిగిన సంపద వారికి దక్కేలా చూసి, అన్ని వివక్షల నిర్మూలనా మార్గాలు పాటించే అసమానతలు లేని పాలన ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం కాపాడుకోగల నేటి తెలంగాణది ఒక అపూర్వ విజయగాథ.
‘అద్భుత ప్రగతి సాధిస్తున్న రాష్ర్టాలను అడ్డుకోకండి. అది దేశ ప్రగతిని అడ్డుకోవడం అయితది. అభివృద్ధి చెందిన తెలంగాణ లాంటి రాష్ట్రం నుంచి వస్తున్న ఆదాయంతో బాగు పడుతున్న ఉత్తరాది రాష్ర్టాలు కూడా దివాళా తీస్తాయి’ అని ఆవేదన చెందిన కేసీఆర్‌ను మించిన నాయకుడు మరిక పుట్టడు. మీ బోడి పార్టీ, మీ దిక్కుమాలిన రాజకీయం, మీ భావదారిద్య్ర లీడర్‌షిప్ మాకు అవసరం లేదు.బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసే కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్; గర్భిణీలకు పౌష్టికాహారం, ప్రసవానికి కిట్ ద్వారా సహాయం, నవజాత శిశువు పేర ఆర్థిక సహాయం-ఒక బాధ్యత కలిగిన తండ్రిలా ఆడపిల్లను ప్రతి దశలో ఆదుకునే యజ్ఞం నిర్వహిస్తూనే; State of the art విద్యాలయాలు, వైద్యాలయాలు, దేవాలయాల స్థాపన గురించి నిర్ణయం తీసుకోగలరు. గొర్రెలు, మత్స్య సంపద పెంచి అందరూ బలవర్ధకమైన తిండి తినాలని ఒక అతిథేయియై కంచం నిండుగా వడ్డిస్తూ మాట్లాడుతూనే, సమాజపు ఔన్నత్యం గురించి వైతాళికులను మించి మాట్లాడగలరు. మున్నెన్నడూ ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో రైతు శ్రేయో రాజ్యం ఏర్పడింది ఇక్కడ! ప్రైవేట్‌రంగంలో సైతం దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తూ, దళితబంధు ద్వారా సాధికారులను చేస్తూ, మరోవైపు అగ్రకుల పేదలను సైతం అక్కున చేర్చుకోగలరు. హిందూ-ముస్లిం-సిక్కు-ఇసాయీలందరూ ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసుకోండి. జీఎస్డీపీ పెంపు, దేశమంతా కరెంటు వెలుగులు, ఇంటింటికీ నీళ్ళు ఇస్తామనే భారతీయుడు ఎక్కడ; కులమూ ప్రాంతమూ, ఫ్యాక్షనూ అణువణువునా నిండిన మీరెక్కడ? నక్కకూ నాక లోకానికీ తేడా అంటే ఇదీ!
‘నాడు ఉద్యమాన్ని మేము భావోద్వేగాలతో మొదలు పెట్టలేదు. ఒక వెలుగు వెలిగి ఆరిపోయిన గతకాలపు అనుభవాల నుంచి నేర్చుకున్నం. పూర్తి అవగాహనతో ఉద్యమాన్ని నడిపినం. ఆ మొత్తం ప్రస్థానం దేశంలోని రాబోయే ఏ విప్లవాత్మక కార్యాచరణకైనా ఒక పాఠ్యాంశం అవుతుంది’ అంటరు మా కేసీఆర్. అది అక్షర సత్యం.
కాబట్టే ఇపుడు మా నాయకుడు చెప్పిన ‘ప్రజలు గెలువాలి’ అనే యజ్ఞంలో మేము ఉన్నం.మా కాళ్ళకూ అడ్డుపడితే తొక్కేస్తూ పోతం. మూటాముల్లే సర్దుకోండి. బాధ్యత ఏమన్నా ఉంటే రాయలసీమను కాపాడుకోండి. కొంచెమైనా పాపపరిహారం అయితది. సెలవ్!!
– శ్రీశైల్‌రెడ్డి పంజుగుల
90309 97371
(ఆర్టికల్ @Namasthe Telangana)
Tags brs brsgovernament ktr slider sy sharmila telanganacm telanganacmo thanneeru harish rao ys rajashekhar reddy ysr ysrcp ysrcpt yssharmila reddy