ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పాతపాటి సర్రాజు (72) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. నిన్న శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన 10 గంటలకు ఇంటికెళ్లారు.
ఆ తర్వాత గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన వైసీపీలో కీలకనేతగా కొనసాగుతున్నారు.