తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్య నటి.. హీరోయిన్ గీతా సింగ్ దత్తత తీసుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయాన్ని మరోనటి కరాటే కళ్యాణి సోషల్మీడియాలో వెల్లడించారు.
‘కారు, బైక్పై జాగ్రత్తగా వెళ్లండి పిల్లలు. కమెడియన్ గీతా సింగ్ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు’ అని పోస్టు చేశారు. వాస్తవానికి గీతా సింగ్ పెళ్లి చేసుకోలేదు. తన సోదరుడు చనిపోవడంతో అతని ఇద్దరు కుమారులను దత్తత తీసుకున్నారు.