Home / POLITICS / KTR: ప్రధానికి స్నేహితుడి సంక్షేమమే కావాలి: కేటీఆర్
Brs leader krishank CRITISICE TO PRADANI MODI

KTR: ప్రధానికి స్నేహితుడి సంక్షేమమే కావాలి: కేటీఆర్

KTR: రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌ క్రిశాంక్‌ ట్వీట్‌ను మెచ్చుకుంటూ మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా కేంద్రం మాట తప్పిందని వీడియోలో వివరించారు. ప్రధానికి స్నేహితుడి సంక్షేమం తప్ప మరొకటి అక్కర్లేదని కేటీఆర్ విమర్శించారు. స్నేహితుడి ప్రయోజనాలే ఎక్కువ కావడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు బైలడిల్లా నుంచి బయ్యారానికి ముడి ఇనుము సరఫరా చేయాలంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందని మన్నె క్రిశాంక్ తెలిపారు. ఆ విజ్ఞప్తిని ప్రధాని మోదీ పట్టించుకోకుండా బైలడిల్లా నుంచి కొరియన్‌ కంపెనీ పాస్కోకు ముడి ఇనుమును సరఫరా చేయాలని 2018 ఏప్రిల్‌ 25న నిర్ణయించారని వివరించారు. ప్రధానికి ప్రజలు తప్ప కార్పోరేట్ బాగోగులే కావాలని విమర్శించారు.

అయితే 2018 సెప్టెంబర్‌ 20న గుజరాత్‌ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ బైలడిల్లాను టేకోవర్‌ చేశారని….. పాస్కో కంపెనీ, అదానీ కంపెనీ కలిసి 37,500 కోట్ల రూపాయలతో స్టీల్‌ మిల్‌ డీల్‌పై సంతకాలు చేశారని క్రిశాంక్ తెలిపారు. అలా అంటూ మన్నె క్రిశాంక్ ట్వీట్ చేశారు…… ట్వీట్‌ను మెచ్చుకుంటూ మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. మంచి పరిశోధన, గొప్ప విశదీకరణ చేశారని మన్నె క్రిశాంక్‌ అని కొనియాడారు. బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రధాని పట్టించుకోకపోవడం వెనుక అసలు కారణమెంటో మనకు ఇప్పుడు తెలిసిందని పేర్కొన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat