KAVITA: నిజామాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్‌లో సౌకర్యాలపై నిర్వహించిన వెబినార్‌లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. నిజామాబాద్‌లో ఐటీ హబ్ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయని తెలిపారు. హైదరాబాద్‌తోపాటు అనేక టైర్ 2 నగరాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు భారాస ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ తెలిపారు. వాళ్ల చొరవతోనే నిజామాబాద్‌కు ఐటీ హబ్ మంజూరైందని అన్నారు.
తెలంగాణలో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు లాండ్ బ్యాంక్ అందుబాటులో ఉందని కవిత అన్నారు. ప్రభుత్వం తరపున సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. నిజామాబాద్‌లో ఐటీ విద్యనందించే విద్యా సంస్థలతో పాటు, కోచింగ్ సంస్థలు కూడా ఉన్నాయని తెలిపారు. డిప్లొమా విద్యార్థులకు సైతం మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
నిజామాబాద్‌లో ఐటీ హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయని భారాస ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ అన్నారు. అట్లాంటా, న్యూజెర్సీ, డల్లాస్, వాషింగ్టన్ డీసీ, చికాగో నగరాల్లో పర్యటించి ఐటీ హబ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరినట్లు తెలిపారు. వివిధ దేశాలకు చెందిన ఐటీ కంపెనీలు సైతం ఇక్కడికి వస్తాయని వివరించారు.
రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని ఎమ్మెల్యే గణేష్ అన్నారు. నిజామాబాద్ ఐటీ హబ్ పూర్తి అయితే జిల్లా యువతకు మెరుగైన అవకాశాలు దొరుకుతాయని అన్నారు. ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా 4 వేల ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. సొంత జిల్లాలోనే ఉంటూ ఉద్యోగం చేసుకోవచ్చని వివరించారు.