KANNABABBU: తెదేపాకు జనాల నుంచి స్పందన కరవైందని మంత్రి కురసాన కన్నబాబు అన్నారు. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్రకు పట్టుమని 10 మంది కూడా రాలేదని అన్నారు. అది చూసి చంద్రబాబుకు పరిస్థితి ఏంటో అర్థమైపోయిందని విమర్శించారు.
మాట్లాడితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు…ఇన్నేళ తన రాజకీయ ప్రస్థానంలో రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. ఎలాంట అజెండా లేకుండా లోకేశ్ పాదయాత్ర సాగుతోందని మంత్రి విమర్శించారు. ఆఖరికి చంద్రబాబు కుప్పం నుంచి కూడా గెలవలేని పరిస్థితికి వచ్చేశారని వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు దరిద్రం పట్టుకుంది…చివరకు దేవుడు కూడా కరుణ చూపించట్లేదు. చంద్రబాబు ఎక్కడ కాలుమోపితే…అక్కడ దరిద్రమని మంత్రి కన్నబాబు విమర్శించారు. జగన్ ను ఏమీ చేయలకే….శాపనార్థాలు పెడుతున్నారని మండిపడ్డారు. వాళ్ల అజెండా జగన్ ను తిట్టడమే. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట్రానికి కరవు, కాటకాలు వచ్చాయని అన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక సమృద్ధిగా వానలు కురిశాయని తెలిపారు. జగన్ పాలనలో ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండుతున్నాయని తెలిపారు. లోకేశ్, చంద్రబాబు ప్రవాసాంధ్రులని మంత్రి ఎద్దేవా చేశారు. ఎక్కడో ఉండి అతిథి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చివరకు వాళ్ల పార్టీ కార్యకర్తే…..ఇక్కడికొచ్చి రాజకీయాలు చేయండని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఓర్వలేనితనంతో లోకేశ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సిగ్గు, శరం లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సీఎం జగన్ నే లోకేశ్ ఏకవచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు సీఎంను విమర్శించే స్థాయి లోకేశ్ కు ఉందా అని ప్రశ్నించారు. ఎవరు అన్నో…ఎవరు దున్నో అందిరికీ తెలుసని విమర్శించారు.