MINITER AMBATI: తెదేపా హయాంలోనే పోలవరాన్ని సర్వ నాశనం చేశారని జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంత్రి అంబటి రాంబాబు పోలవరంలో పర్యటించారు. మంత్రితో పాటు ఎంపీలు మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, పాల్గొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ధనలక్ష్మి కూడా ఉన్నారు.
దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కావడంతో హిల్ వ్యూ నుంచి ప్రాజెక్టును మంత్రితో కలిసి పరిశీలించారు. అంతేకాకుండా పోలవరం పనుల పురోగతిని కూడా పర్యవేక్షించారు.
అనంతరం మీడియా మంత్రి రాంబాబు మాట్లాడారు. తెదేపా అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. తెదేపా వ్యాఖ్యలను, చేష్టలను ప్రజలు పట్టించుకోరని వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా పోలవరం కోసం ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని…చిత్తశుద్ధితో ఉందని అన్నారు.
చంద్రబాబుకు, లోకేశ్ కు ప్రచారం తప్ప….మరోకటి లేదని విమర్శించారు. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించారని తెలిపారు. తెదేపా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పనుల వల్లే పోలవరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. చంద్రబాబు చేష్టలతో రాష్ట్రం నాశనమైందని దుయ్యబట్టారు. ప్రచారం తప్ప ప్రజల కోసం ఆలోచించరని వ్యాఖ్యానించారు.