KODALI NANI: రాష్ట్రానికి జోకర్ లాగా లోకేశ్ తయారయ్యారని వైకాపా నేత, ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ను వ్యక్తిగతంగా చంద్రబాబు దూషిస్తున్నారని మండిపడ్డారు.
లోకేశ్ పాదయాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానించారు. అంత పెద్ద స్థాయిలో ఉన్న సీఎం జగన్ ను వ్యక్తిగతంగా దూషిస్తే తప్పులేదా….. మేం ఏమైనా అంటే మాత్రం ఏడుపులు, శోకాలు పెట్టి రచ్చకెక్కుతారని మండిపడ్డారు.
సీఎం జగన్ రాయలసీమ…అతనికి అంత సత్తా ఉంది కాబట్టే సోనియా గాంధీని ఎదిరించి పార్టీని పెట్టి భారీ మెజార్టీతో గెలిచారని తెలిపారు. జగన్ డీఎన్ఏ రాయలసీమ….లోకేశ్ డీఎన్ఏ తెలంగాణ, లోకేశ్ పుట్టింది, పెరిగింది, చదువుకుంది తెలంగాణనే. ఇంత హీనమైన చరిత్ర ఉన్న లోకేశ్…..జగన్ ను విమర్శిస్తారా అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు. పుట్టుకతోనే దరిద్రవంతుడు చంద్రబాబు, చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసని అన్నారు. ఏ ముఖ్యమంత్రి పరిపాలించినా…ప్రాజెక్టులు నిండాయి గానీ…చంద్రబాబు హయాంలో మాత్రం ఏ ఒక్క ప్రాజెక్టు నిండలేదని మండిపడ్డారు,
చంద్రబాబు పాలిస్తే రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంటుందని ప్రజలకు తెలుసు….అందుకే ప్రజలు కూడా సరైన బుద్ధి చెప్పారని విమర్శించారు. ఎన్టీఆర్ సంపాదించిన ఆస్తి…చంద్రబాబుకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ అవినీతి చక్తవర్తి ఆస్తి అంతా ఎన్టీఆర్ ది. ఎన్టీఆర్ వారసులంతా సామాన్యుల్లా బతుకుతుంటే….ఎన్టీఆర్ ఆస్తి నీకు పంచారా? అని ప్రశ్నించారు. హెరిటేజ్ పెట్టి కోట్లకు కోట్లు అప్పనంగా సంపాదించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు….సీఎం జగన్ పండగ చేసి నిరూపించారని అన్నారు.