ఏపీ తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే పీల్చే గాలి మీద కూడా పన్ను వేస్తారని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజలను ఊదమంటారని, ఎవరు ఎక్కువ ఊదితే వాళ్లకు ఎక్కువ పన్ను వేస్తారని సెటైర్లు వేశారు. సీఎం జగన్ రూ.10 ఇచ్చి.. చెత్తపన్ను, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను పెంచి రూ.100 కొట్టేస్తున్నారని మండిపడ్డారు. లోకేశ్ ప్రస్తుతం సత్యవేడు నియోజకవర్గంలో యాత్ర చేస్తున్నారు.