Byreddy: వచ్చే ఎన్నికల్లో తెదేపా కచ్చితంగా ఓడిపోతుందని వైకాపా నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కనీసం 3 సీట్లు కూడా దక్కవని మండిపడ్డారు. మంగళగిరిలో గెలవలేని లోకేశ్….పార్టీన అధికారంలోకి తీసుకొస్తాననడం విడ్డూరంగా ఉందని అన్నారు. లోకేశ్ ఒక ఫెయిలైన రాజకీయ వేత్త అని వ్యాఖ్యానించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి వైఎస్ జగన్, అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు, లోకేశ్
చంద్రబాబు, లోకేశ్ సీఎం జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. సొంత నేతలే అసంతృప్తితో ఉంటే ఇంకేం గెలుస్తారని దుయ్యబట్టారు. ఎప్పుడూ అసత్యాలు, విషప్రచారాలు చేసుకుని పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పై తప్పుడు కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపింది సీఎం జగనేనని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఐదేళ్లలో నెరవేరుస్తామని తెలిపారు. ఎక్కడో వేరే రాష్ట్రంలో ఇల్లు కట్టుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడమేంటని మండిపడ్డారు. చివరకు ఒక మహిళా మంత్రిపైనా నొట్టికొచ్చినట్లు మాట్లాడుతుంటే…..వాళ్లకు మహిళల పట్ల ఎంత గౌరవముందో తెలుస్తోందని వ్యాఖ్యానించారు.
2014-2019లో సిమెన్స్ కంపెనీని అడ్డం పెట్టుకుని వేలకోట్లు దోచుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోంది. నాణ్యమైన పాఠశాల విద్యను అందిస్తున్నాం. రైతులకు అండగా ఉన్నాం, రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేకే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు,