AMBATI: వైకాపా ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటుందని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం వల్ల మూడు ప్రాంతాల్లో సమానమైన అభివృద్ధి సాధ్యం అవుతుందని వ్యాఖ్యానించారు.
ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి హైదరాబాద్ ను వదులుకోవల్సి వచ్చిందన్నారు. అన్ని రకాల కంపెనీలు, పెట్టుబడులు హైదరాబాద్ కే వెళ్లిపోయాయని అన్నారు. దీని వల్ల ఎంతో నష్టపోయామో ఆలోచిన చేయాలని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికీ ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. రాష్ట్రం విభజన జరిగాక అన్ని రకాలుగా నష్టపోయామని అన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకూడదంటే 3 రాజధానులు కచ్చితంగా రావాలని అది అవసరమని పునరుద్ఘాటించారు.
కానీ అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశమని అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలనే సదుద్దేశంతోనే 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చామన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరిస్తేనే రాష్ట్ర వృద్ధి జరుగుతుందని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు. 3 రాజధానులే మా పాలసీ…..మా నిర్ణయానికి మేం ఎప్పటికీ కట్టుబడి ఉంటామని వ్యాఖ్యానించారు. దీనిపై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
భవిష్యత్తులో ఎలాంటి ఆందోళన, అభద్రత భావం ప్రజల్లో రాకూడదనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ఇంత గొప్ప పనికి బాటలు వేశారని అన్నారు.
మూడు రాజధానులు వస్తే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర వృద్ధి సాధిస్తుందని అంటున్నారు. పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.