Politics సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తాజాగా మీడియాతో మాట్లాడిన సమావేశంలో అదాని కుంభకోణాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటానికి ప్రధాన నరేంద్ర మోడీ ఎందుకు భయపడుతున్నారు అంటూ ప్రశ్నించారు.. దేశంలో ధనవంతులు రోజురోజుకీ ధనవంతులు అవుతున్నారని పేదవాడు మరింత దిగజారిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు..
అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జాతీయ సమితి దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయం ముందు సోమవారం సీపీఐ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు ఆదానీ కుంభకోణాలపై జాయిన్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా తక్షణమే ఆదానిని అరెస్టు చేయాలని చెప్పుకొచ్చారు.. అంతగా అన్యాయాలు జరుగుతుంటే పాలకులు మాత్రం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు..
ఈ సందర్భంగా మాట్లాడిన సాంబశివరావు.. అదానీ ఆర్థిక సామ్రాజ్యం గాలిబుడగ లాంటిదని.. అది అవినీతి పునాదులపైన నిర్మించిన సామ్రాజ్యమని విమర్శించారు. హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదికతో ఆదాని అవినీతి సంపాదన మొత్తం గుర్తు రట్టు అయిందని తెలిపారు అలాగే ఎల్ఐసి నుంచి 80 వేల కోట్లు ఎస్బిఐ నుంచి 25 వేల కోట్లు పెట్టుబడులు ఆదాని కంపెనీలో పెట్టారని ప్రజల సొమ్మును అదాని కంపెనీలో ఎలా పెట్టుబడులు పెడతారని ప్రశ్నించారు.. దేశంలో ధనవంతులు రోజురోజుకీ ధనవంతులు అవుతున్నారని పేదవాడు మరింత దిగజారిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు..