Politics తెలంగాణలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులపై ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదని ఆ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు..
తెలంగాణా ఆసుపత్రులపై నియంత్రణ తీసుకువచ్చేందుకు క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని అన్నారు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తాజాగా శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. “దుబ్బాకకు డయాలసిస్ సెంటర్ కేటాయించాము.. దాన్ని తొందరలోనే ప్రారంభిస్తాము.. దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాము.. ” అని చెప్పారు.
అలాగే అసలు పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లకుండా ప్రభుత్వం ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ సేవలు పొందే విధంగా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు ఈ ఉద్దేశంతోనే రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలో తీసుకొస్తామని అలాగే మెడికల్ కాలేజ్ వస్తే ప్రొఫెసర్లు వస్తారని వారితో పాటు 600 పడకల ఆసుపత్రి వస్తుందని తెలిపారు అలాగే ఆపరేషన్ థియేటర్లు వస్తాయని అన్నారు. దీని ద్వారా పేద ప్రజలకు వాళ్ల జిల్లాలోనే కార్పొరేట్ వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రమంతా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇవన్నీ త్వరలోనే అమలు అవుతాయని అన్నారు.. ముఖ్యంగా ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఆరోగ్యం ప్రయోజనాలు అందుకోవాలని ఇందుకోసం త్వరలోనే ఆరోగ్యశ్రీని మరింత సదుపాయాలు కల్పించే విధంగా మారుస్తామని తెలిపారు