జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్… మాజీ సీఎం.. ఏడుసార్లు ఎంపీగా గెలుపొందిన తాజా రాజ్యసభ సభ్యులు శిబు సోరెన్ అనారోగ్యంతో రాంచీలోని మేధాంత ఆస్పత్రిలో చేరారు.
శ్వాసకోస సమస్యతోపాటు లంగ్స్, కిడ్నీల సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం సోరెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతుందని ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చెప్పారు. 2006-10 మధ్య సోరెన్ జార్ఖండ్ సీఎంగా పనిచేశారు.