తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నిర్మాత సురేష్ బాబు, ఆయన తనయుడు ప్రముఖ స్టార్ హీరో దగ్గుబాటి రానాపై కేసు నమోదైంది. భూవివాదం కేసులో తమను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని వ్యాపారి ప్రమోద్ కుమార్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీంతో సురేష్ బాబు, రానా సహా మరికొందరిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
