దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో అరెస్ట్ నమోదైంది. ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవ్ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
రాఘవ్ రెడ్డిని మధ్యాహ్నం కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన సీఏ బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్ర సహా పలువురిని అరెస్ట్ చేశారు.