తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న గిరిజనులకు శుభవార్తను తెలిపింది. ఎస్టీ విచారణ సంఘం ఆరేండ్ల కిందట 2016లో ఇచ్చిన సిఫారసుల మేరకు వాల్మికీ,బోయ,బేడర్,కిరాతక,నిషాద్,పెద్దబోయలు,తలయారి,చుండువాళ్లు,కాయితి లంబాడాలు,భాట్ మధురాలు ,చమర్ మధురాలను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న 11.5లక్షల పోడుభూములను పట్టాలుగా గిరిజనులకు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.
అంతే కాకుండా ఆ భూములకు రైతుబంధు,కరెంటుతో పాటు సాగునీళ్లను అందిస్తామని ప్రకటించారు. అయితే భూములు రానీ గిరిజనులకు గిరిజన బంధును ఇస్తామని తెలిపారు.