Politics ఆంధ్రప్రదేశ్ రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా తాజాగా యనమల రామకృష్ణుడు పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో టాయిలెట్లు కూడా సరిగాలేవు. పరిస్థితులన్నీ మారాక ఈరోజు అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నారు. ఆయన అన్ని పక్ష అబద్ధాలే మాట్లాడుతున్నారని చెప్పకు వచ్చారు..
ఏపీ రోడ్లు భవన శాఖ మంత్రి దాడిశెట్టి రాజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ యనమల రామకృష్ణుడిపై విమర్శలు గుప్పించారు అన్ని పచ్చి అబద్దాలు చెబుతూ జనాలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు అలాగే..
“ఏపీ విద్యా విధానాలను కేంద్ర బడ్జెట్‌లోనూ ప్రస్తావించారు. అనేక విషయాల్లో రాష్ట్రానికి గుర్తింపు లభించింది. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చాం. విద్య, వైద్య రంగాలకు అత్యధికంగా ఖర్చు చేస్తున్నాం.. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో టాయిలెట్లు కూడా సరిగాలేవు. పరిస్థితులన్నీ మారాక ఈరోజు అబద్ధాలు ఎలా మాట్లాడుతున్నారు.. నాడు-నేడు కింద రూపురేఖలు మార్చిన స్కూళ్లు గురించి తెలుసుకో. యనమల స్వగ్రామంలోనూ నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది.. యనమల వస్తే నియోజకవర్గంలో స్కూళ్లకు తీసుకెళ్తా. ఇక్కడ పరిస్థితులను కల్లారా చూస్తే అతనికి తెలుస్తుంది అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఎంతగా మారాయి ప్రభుత్వం స్కూళ్లలో ఎంత మార్పును తీసుకొచ్చింది అనే విషయం అర్థమవుతుంది.. ఆయన అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారు. హైస్కూల్ వస్తే మన పొలాల్లో పనిచేసేందుకు ఎవరూ ఉండరన్నావు. యనమల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.. ” అని మంత్రి రాజా చెప్పుకొచ్చారు..