Politics తాజాగా తెలంగాణ శాసనసభలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ భాజపా కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ధరణిని రద్దు చేయడం ప్రగతి భవన్ ను బద్దలు కొట్టడం కాంగ్రెస్ విధానము అంటూ ప్రశ్నించారు..
తెలంగాణ శాసనసభలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ధరణిని రద్దు చేయడం ప్రగతి భవన్ ను బద్దలు కొట్టి బాంబులతో పేల్చేయడం కాంగ్రెస్ విధానమ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కొన్ని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు..
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. “ధరణి పోర్టల్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని.. గత ఆరేండ్లలో 30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే, ఈ ఏడాదిన్నర కాలంలోనే 23 లక్షల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అయితే అన్ని సవ్యంగా జరిగితే ఎవరూ మాట్లాడరు. ఎక్కదో ఒక చిన్న లోపం జరిగితే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. ఒకట్రెండు లోపాలు జరిగితే రాష్ట్రమంతా గందరగోళం నెలకొందని చెప్పడం సరికాదన్నారు. ధరణిని రద్దు చేస్తామని పార్టీ అధ్యక్షుడు చెప్తున్నాడు. ధరణిని రద్దు చేయడం పార్టీ విధానమే అయితే.. పార్టీ పరంగా చెప్పండి. ధరణి వల్ల రైతులకు ఏ లాభం లేదు.. రద్దు చేస్తామని చెప్పండి. కాంగ్రెస్ హయాంలో లంచం లేకుండా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయకుండా రైతులను రాక్షసంగా ఇబ్బంది పెట్టినట్లే ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాం అని శ్రీధర్ బాబు చెప్పదలుచుకున్నారా?.. రైతులను పీడించడం, వారి పట్ల కర్కశకంగా వ్యవహరించడమే మా విధానం అని ఆయన చెప్పదలుచుకున్నారా..? రెవెన్యూ వ్యవస్థలో లంచగొండితనం ఉండాలనేది వారి విధానమా.. ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం సరికాదు. శాసనసభను, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడొద్దు..” అంటూ మంత్రి కేటీఆర్ సూచించారు.