తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని అమెరికాకు చెందిన ప్రొవిడెన్స్ హెల్త్ సిస్టమ్స్ కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను మూడింతలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం కంపెనీలో 1,000 మంది పనిచేస్తున్నారని, ఆ సంఖ్యను 3వేలకు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు కంపెనీ సీఈవో డాక్టర్ రాడ్ హోచ్మన్, సీఐవో మూర్, ఇండియా హెడ్ మురళీ కృష్ణలు భేటీ అయ్యారని ట్విటర్లో పేర్కొన్నారు.