తెలంగాణలో మే 7న ఎంసెట్ పరీక్ష జరగనున్న సంగతి విదితమే. అయితే ఈ పరీక్షలకు హజరై విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్లో ఇంటర్ ఫస్టియర్ 70% సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.
సెకండియర్లో 100% సిలబస్ చదవాల్సిందేనని పేర్కొన్నారు. 2021-22లో కరోనా కారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 70% సిలబస్తో పరీక్షలు రాశారని.. ఎంసెట్లో కూడా అదే సిలబస్ ఉంటుందన్నారు.