ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.