కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న ట్రైనీ ఐపీఎస్‌ల పరేడ్‌కు ఆయన హాజరవుతారు. 190 మంది ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా అమిత్ షా వారితో మాట్లాడనున్నారు. వీరిలో 29మంది విదేశీ ఆఫీసర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లు ఉన్నారు.
