Politics బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సాక్షిగా మోడీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు..
త్వరలోనే ఎన్నికల్లో రాబోతున్న నేపథ్యంలో కేంద్రంపై బీఆర్ఎస్ ప్రభుత్వం విరుచుకుపడుతూ వస్తుంది.. రైతులకు అందించే సహాయంపై ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దేశవ్యాప్తంగా ఎందరో రైతులకు సహాయం చేస్తున్నామని ఇప్పటివరకు మోడీ చెప్పుకొచ్చారని కానీ అలా జరగటం లేదని తెలిపారు. అంతేకాకుండా 11కోట్ల మంది రైతులకు నగదు సహాయం ఇస్తున్నారని ప్రధాని చెప్పారని, కేంద్రం 3.87కోట్ల మంది రైతులకే నగదు సాయం అందిస్తోందని కవిత పేర్కొన్నారు.
అలాగే ప్రతి ఏడూ నగదు సహాయం పొందే రైతుల సంఖ్యను కేంద్రం తగ్గించుకుంటూ వస్తుందని ఇది ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని అన్నారు అంతే కాకుండా ఈ సందర్భంగా మాట్లాడిన కవిత అదానీ విషయం సైతం దుమ్మెత్తి పోశారు.. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించి.. విచారణ జరిపించాలని భారత్ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సంస్థ అయినా ఎల్ఐసి అదాని సంస్థల్లో పెట్టుబడులు పెట్టిందని అతని వ్యవహారం పై వస్తున్న విమర్శలకు కేంద్రం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.. అలాగే త్వరలోనే లోక్సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం పైన తనదైన శైలిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే అంతేకాకుండా ఎప్పటికప్పుడు కేంద్రాన్ని తనదైన శైలిలో ప్రశ్నిస్తూ వస్తుంది..