తాను పాన్ ఇండియా నటుడిని కాదని.. కేవలం నటుడినేనన్నారు ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతి. ‘పాన్ ఇండియా యాక్టర్ అనే స్టేట్మెంట్ నాకు అంత సౌకర్యంగా ఉండదు.
అది కొన్నిసార్లు నన్ను ఒత్తిడికి గురిచేస్తుంది. నేను కేవలం నటుడినే. దాని కింద ఎలాంటి ట్యాగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అన్ని భాషల్లో నటించడానికి ఇష్టపడతా. అవకాశం వస్తే బెంగాలీ, గుజరాతీలో కూడా’ అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.