ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు ఆదివారం సమావేశమవనుంది. ఈ సమావేశంలో భాగంగా ఆదివారం ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీకానుంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు ఈ నెల 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై మంత్రివర్గం చర్చించి, ఆమోదం తెలుపనున్నది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే.