తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ అధినేత.. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
వారికి ప్రతి నెలా అందిస్తున్న గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచుతూ జీవో జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 26వేల పాఠశాలల్లోని 54,201 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. అయితే, కొత్త వేతనం అమలు ఎప్పటినుంచి అనేది జీవోలో పేర్కొనలేదు.