KTR, OYC: శాసనసభ వేదికగా కేటీఆర్, ఓవైసీ మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ పై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో హామీలు ఇస్తారు గానీ వాటిని అమలు చేయరంటూ ఓవైసీ విమర్శించారు.
మేం కలుస్తామంటే….సీఎం, మంత్రులు ఇష్టంగా ఉండరని అన్నారు. బీఏసీలో ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. 25 ఏళ్లలో ఇలాంటి సభను ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. పాతబస్తీకి మెట్రో…ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
అక్బరుద్ధీన్ విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎంఐఎంకు ఉండేది ఏడుగురు ఎమ్మెల్యేలు. అలాంటప్పుడు వాళ్లకు ఎంత సమయం ఇస్తారని ప్రశ్నించారు. ఏడుగురు సభ్యులున్న పార్టీకి ఎక్కువ సమయం ఇవ్వడం సమంజసం కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అయితే దిల్లీలో భారాస కార్యాలయ ప్రారంభోత్సవానికి అఖిలేష్ యాదవ్, కుమారస్వామి హాజరైనప్పటికీ ఓవైసీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. భారాస, ఎంఐఎం మధ్య ఎప్పటినుంచే ఉన్న స్నేహం కుంటుపడుతోందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే అసెంబ్లీలో తాజా పరిస్థితులు చూస్తుంటే భారాస, ఎంఐఎం మధ్య కాస్త గ్యాప్ పెరిగినట్లుగా అనిపిస్తోంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే.