MINISTER JAGADEESH: శాసనసభలో గవర్నర్ చేసిన ప్రసంగాన్ని వ్యతిరేకించిన భాజపా నాయకుల వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థలను, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని భాజపా నేతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
గవర్నర్ ప్రసంగాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో స్పష్టం చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. గవర్నర్ తో అబద్దాలు చెప్పించామని భాజపా నేతలు అంటున్నారు. అయితే ఇన్ని రోజులు భాజపా నాయకులు గవర్నర్ తో అబద్దాలు చెప్పించారా అని మంత్రి ప్రశ్నించారు. శాసనసభలో అబద్దాలు చెప్పించారన్న భాజపా నేతలకు గవర్నర్ తమిళిసై సమాధానం చెప్తారని వెల్లడించారు.
భాజపాకు కుట్ర రాజకీయాలు, ఓట్లు తప్ప మరేమీ పట్టదని మంత్రి విమర్శించారు. రాజ్యాంగ సంస్థలు, ప్రజల పట్ల భాజపాకు గౌరవంలేదని ఆరోపించారు. ఎప్పుడు తప్పుడు రాజకీయాలు, పగలు, ప్రతీకారాలే తప్ప..ప్రజల గురించి పట్టించుకోరని మండిపడ్డారు.