AKHILA: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలులో భూమా అఖిలప్రియను పోలీసులు గృహనిర్బంధం చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికు బహిరంగ చర్చకు రావాలని భూమా అఖిల సవాల్ విసిరారు. నంద్యాల గాంధీ చౌక్ దగ్గరకు బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.
ఎన్నికలు దగ్గరపడేకొద్దీ అధికార పార్టీలో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇదివరకే నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఇద్దరు వైకాపా నుంచి బయటకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆరోపణలు మొదలు పెట్టారు.
ఇద్దరు నేతలు తెదేపాలో చేరేందుకు సిద్ధమవుతుంటే…. ఇదే పంథాలో కర్నూలు జిల్లాలోని వైకాపా నేతలు కూడా తెదేపా వైపు చూస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు.
త్వరలో శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి అక్రమాలు బయటపెడతానంటూ భూమా అఖిల సవాల్ విసిరారు. దమ్ముంటే నంద్యాల గాంధీచౌక్ వద్దకు బహిరంగ ఇదిలా ఉంటే నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికు అఖిల ప్రియ సవాల్ విసిరారు.
దీంతో నంద్యాల గాంధీ చౌక్ కు భూమా అఖిల వెళ్లకుండా గృహనిర్బంధం చేశారు. అఖిల ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.