KAKANI: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మరో వైకాపా నేత దుయ్యబట్టారు. పార్టీ మారాలనే ఆలోచన ఉన్నప్పుడు మారాలి గానీ…..ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించకూడదని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి….చంద్రబాబు మాయలో పడ్డారని వ్యాఖ్యానించారు.
2014 ఎన్నికల వేళ నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో ఎంత పోటీ ఉన్నా…..సీఎం జగన్ గెలిపించారని తెలిపారు.
నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే కోర్టుకు వెళ్లాలిగానీ…..ఇప్పటివరకూ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కేంద్రం హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్న మాట ఏమైందని ప్రశ్నించారు. వాళ్లు చేసేది డ్రామాలని వాళ్లకు కూడా తెలుసని దుయ్యబట్టారు.
కోటంరెడ్డి వైకాపాకు వీధేయుడు కాదు…..తెదేపాకు వీధేయుడిని మండిపడ్డారు. తెలుగుదేశం అభ్యర్థిగా ఖరారయ్యాకే గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఈ స్థితిలో ఉండటానికి సీఎం జగన్ కాదా అని ప్రశ్నించారు.
ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం జరగదని వ్యాఖ్యానించారు. జగన్ తప్ప మరెవరున్నా కోటంరెడ్డికి టికెట్ వచ్చేదికాదని తెలిపారు. నీకు అసంతృప్తి ఉంటే అధిష్టానంతో మాట్లాడాలిగానీ ఇలా రోడ్డెక్కడం సరికాదని అన్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని తెలుసు….అందుకే ఫిర్యాదు చేయలేదని అన్నారు.