తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్ కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఆయన పూర్తిపేరు కాశీనాధుని విశ్వనాథ్. అప్పటి ఉమ్మడి ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు గ్రామం ఆయన స్వస్థలం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వత్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.