JAGGAREDDI: శాసనసభలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. మొన్నటివరకు భారాస ప్రభుత్వంపై కోపాలు, అలకలు, గర్జనలు చేసిన గవర్నర్….శాసనసభలోకి రాగానే పిల్లిలా అయిపోయారని ఎద్దేవా చేశారు.
భారాస, భాజపాలో ‘బి‘లో ఉంది….గవర్నర్ మూడో బి అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాసిచ్చిందే గవర్నర్ శాసనసభలో అప్పజెప్పారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులు రాసిచ్చిందే గవర్నర్లు చదువుతారని జగ్గారెడ్డి విమర్శించారు.
శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య సయోధ్య కుదిరిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే గవర్నర్ నడిచారని జగ్గారెడ్డి విమర్శించారు.
కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం ఏకంగా బహిరంగంగానే జరిగిందని తెలిపారు. చివరకు ధర్మాసనం కలగచేసుకోవడంతో తగ్గారని వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల్లో ఏంటో మాట్లాడుతారోనన్న ఉత్కంఠను గవర్నర్ తుస్సుమనిపించారని మండిపడ్డారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ గవర్నర్ కు నమస్కరించి స్వయంగా ఆహ్వానించి సభకు తీసుకొచ్చారు. అనంతరం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి తెలుగులో కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారని జగ్గారెడ్డి తెలిపారు.