SAJJALA: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై వైకాపా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సర్పంచుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెదేపాలోకి చేరుకున్నాక……తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోటంరెడ్డి తన నిర్ణయాలు తాను తీసుకున్నాక….ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటామని ప్రశ్నించారు. కోటంరెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెబుతున్నారు. అయినా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్….ప్రజల కోసం పాలన చేస్తున్నారు,,,,,ఫోన్ ట్యాపింగ్ లను నమ్ముకుని కాదని వ్యాఖ్యానించారు. పదవి రాకపోతే బాధపడొచ్చు, కానీ ఇలా బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.