KTR: సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మన ఊరు–మన బడిలో భాగంగా నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి సబితతో కలిసి క్యాంపస్ ను ప్రాంభించారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ పరిశీలించారు. జిల్లాలో మొత్తం ఏర్పాటు చేసిన 22 పాఠశాలలను సైతం ప్రారంభించనున్నారు.
గంభీరావుపేటలో ఆరెకరాల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మించారు. రహేజా కార్ప్ ఫౌండేషన్, మైండ్‌స్పేస్ రిట్, యశోద హాస్పిటల్, ఎమ్మార్‌ఎఫ్, డీవీస్ ల్యాబ్, గివ్ తెలంగాణ, గ్రీన్‌కో సహకారంతో 3కోట్ల రూపాయలతో అన్ని రకాల అధునాతన వసతులతో దీనిని నిర్మించారు.య
3500 మంది తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్ హబ్‌లా నిర్మాణాలు పూర్తి చేశారు. 250 మంది పిల్లలకు సరిపడేలా అంగన్‌వాడీ, చిన్నారులకు ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానంతో పాటు ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాలకు అనుగుణంగా భవన సముదాయాలు సిద్ధం చేశారు. డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం, వెయ్యి మంది ఒకే సారి కూర్చొని తినేలా భోజనాల గది నిర్మించారు.