KTR: ఈ ఏడాది ఆగస్టులో కరీంనగర్ జిల్లాలో దళితబంధు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ను పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆగస్టు 16 నాటికి దళితబంధు పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా జాతీయ దళితబంధు నిర్వహించాలని సూచించారు.
కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎమ్మెల్యే కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
జాతీయ దళితబంధు నిర్వహణ సందర్భంగా కలెక్టర్‌కు ఆర్ వి కర్ణన్ కు కేటీఆర్ పలు సూచనలు చేశారు. దళితబంధు సమావేశానికి జాతీయ స్థాయి పారిశ్రామిక వేత్తలను, మేధావులను, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలని సూచన చేశారు. దళిత బంధు గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా కార్యక్రమాలు చేయాలన్నారు. దళితులకు దళితబంధు ఎలా ఉపయోగపడుతుందో…. దేశానికి తెలియజేసే అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.