GANDHI VARDANTHI: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో జాతిపితకు నివాళులర్పించారు. శాసనసభ సభాపతి, మండలి ఛైర్మన్ మహాత్ముడి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
శాంతి, అసింహతోనే మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చారని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ చాటిచెప్పిన పద్ధతుల్లోనే అందరూ నడవాలని హితవు పలికారు.
గాంధీ కలలుగన్న స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణను అనుసరిస్తున్నాయని చెప్పారు.
దేశంలోని సమాఖ్య వ్యవస్థ, లౌకిక విధానాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నేటి పరిస్థితులు రాజ్యాంగానికి ఇబ్బందిగా మారాయని చెప్పారు. పగలు, ప్రతీకారాలతో కుట్ర బుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.