minister venu gopalakrishna: ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రతిపక్ష నేతగా తెదేపా అధినేత చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు విని మోసపోయిన ప్రజలు….ఓటుతో సరైన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.
లోకేశ్ పాదయాత్ర వలన ఎవరికీ ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు చేసే కుట్ర రాజకీయాలను ప్రజలు గుర్తించారని వెల్లడించారు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను ఎంతగా పీడించారో అందరికీ గుర్తుందన్నారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేకుండా నేరుగా లబ్ధిదారులకే పథకాలు అందుతున్నాయన్నారు. లోకేశ్ ను సీఎం చేస్తానని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. రాజకీయాల గురించి మాట్లాడే హక్కు తెెదేపా నేతలకు లేదన్నారు. కరోనా సమయంలోనూ తెదేపా నేతలు ప్రజలకు సాయం చేయలేదని మండిపడ్డారు.