ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం జగనన్న చేదోడు.. ఈ పథకం 3వ విడత సాయాన్ని ప్రభుత్వం రేపు సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.
ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 10వేల చొప్పున సాయాన్ని ప్రభుత్వం ఇస్తుంది.. రేపు పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పాల్గోనున్నారు.
ఈ సభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బటన్ నొక్కి మరి ఈ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. అటు దరఖాస్తులకు గడువు మూడ్రోజులే గడువు ఇవ్వడంపై కొందరు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.