రేపు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా 901 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పతకాలు ప్రకటించింది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ , 93 మందికి విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ తో పాటు 668 మందికి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్‌పతకాలకు ఎంపికయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది .
తెలంగాణ నుంచి 13 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ పతకం, ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకాలకు ఎంపికయ్యారు. ఇందులో ఇంటిలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అనిల్‌కుమార్, 12వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ రామకృష్ణ రాష్ట్రపతి మెడల్‌కు ఎంపికయ్యారు.