గత కొన్ని నెలలుగా మంచి దూకుడు మీదున్న టీమ్ ఇండియా దూకుడే పరమావధిగా దూసుకెళుతోంది. అందులోనూ మొదట బ్యాటింగ్ కు దిగితే మన బ్యాట్స్మెన్లు రెచ్చిపోతున్నారు.
409/8, 373/7, 390/5, 349/5, 385/9.. ఇవీ మొదట బ్యాటింగ్ చేసిన గత ఐదు వన్డేల్లో టీమ్ ఇండియా చేసిన స్కోర్లు. స్వల్ప వ్యవధిలో నాలుగుసార్లు 350 పరుగుల మార్క్ దాటిన భారత్.. అంతర్జాతీయ క్రికెట్లో 30 సార్లు ఈ ఫీట్ నమోదు చేసిన టీమ్ రికార్డుల్లోకి ఎక్కింది.